రుద్రంగి, సెప్టెంబర్ 20: ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే తమ గ్రామంలో వేల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నదంటూ రుద్రంగి మండలంలోని మానాల యువకులు ఆరోపించారు. శనివారం పంచాయతీ కార్యాలయం లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందిని నిర్బంధించారు. కొందరు దుండగులు శుక్రవారం గ్రామ శివారులో అడవిలోని వృక్షాలను తొలగించి భూమిని చదును చేశారనే సమాచారం మేరకు శనివారం అధికారులు రా గా, నిర్బంధించి పంచాయతీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు.
ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిరోజులుగా మానాల శివారులోని అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తొలగిస్తూ భూమి చదును చేసి బోర్లు, బావులు వేసుకుంటున్నారని, బీట్ ఆఫీసర్ మౌనిక ఫారెస్ట్ సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరుగుతున్నదని, డబ్బులు తీసుకొని వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ భూములను కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు వి డన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
శుక్రవారం సైతం అటవీ భూములను చదును చేసి వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని, స్వాధీనం చేసుకు న్న బైకులను సైతం విడిచిపెట్టారని ఆరోపించారు. కొంత సమయం తర్వాత ని ర్బంధించిన వారిని విడిచిపెట్టారు. సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొ ని చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ బాలామణితో మాట్లాడి అన్యాక్రాంతమైన అటవీ భూమి ప్రాంతంలో మొకలను నాటించి, కంచె ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు, యువకులు శాంతించారు. ఇకడ మాజీ వైస్ ఎంపీపీ భూమయ్య, పోలీస్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.