National Turmeric Board | మల్లాపూర్, ఆగష్టు 7: గ్రామాల్లోని రైతులు ఆధునిక పద్ధతుల్లో పసుపు పంటను సాగు చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మండలంలో కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని రైతువేదిక కార్యాలయంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పసుపు పంట విధానంపై రైతులకు గురువారం అవగహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని కొంత మంది పసుపు రైతులు ఎఫ్ పీ ఓలుగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలను తీసుకోవాలన్నారు. అలాగే సేంద్రియ పద్ధతితో నూతనంగా రైతులు పసుపు పంటను పండిస్తే అధిక దిగుబడి వస్తుందని సూచించారు. ఆ ఆయనను స్థానిక రైతులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త మహేందర్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శ్యామ్ ప్రసాద్, డివిజన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఓ లావణ్య, బ్యాంక్ మేనేజర్ సురేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.