Gauravelli Project | ఎల్-21 మైనర్ కెనాల్ రద్దు చేయాలని రైతుల ఆందోళన.. పురుగల మందు డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన సుందరగిరి రైతులు
గౌరవెల్లి ప్రాజెక్టుకు చెందిన ఎల్-21 మైనర్ కెనాల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరగిరి గ్రామానికి చెందిన బాధిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.

Gauravelli Project | చిగురుమామిడి, అక్టోబర్ 26 : గౌరవెల్లి ప్రాజెక్టుకు చెందిన ఎల్-21 మైనర్ కెనాల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరగిరి గ్రామానికి చెందిన బాధిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తమ భూముల మధ్య నుంచి ఎల్-21 మైనర్ కెనాల్ వెళ్లేలా ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ క్రిమిసంహారక మందు డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి బాధిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుందరగిరి గ్రామానికి చెందిన 31 మంది రైతుల భూముల నుంచి ఎల్-21 మైనర్ కెనాల్ వెళ్లనుందని రైతులు తెలిపారు.
ఇదే రైతుల భూముల నుంచి డి-4, ఆర్-20 కాలువలకు సంబంధించి అధికారులు ఇప్పటికే సర్వేలు నిర్వహించారని, ఆ రెండు కాలువల విషయంలో రైతులు సహకరించారని పేర్కొన్నారు. అయితే ఎల్-21 మైనర్ కెనాల్ వల్ల తమ భూములకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు వాటర్ ట్యాంక్ నుంచి కిందికి దిగేది లేదని రైతులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారుల హామీతో ఆందోళన విరమణ
రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ కోడం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్, స్థానిక సర్పంచ్ జంగ శిరీష, సింగిల్ విండో మాజీ చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని కోరారు. రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి 31 మంది రైతులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించి వాటర్ ట్యాంక్ నుంచి కిందికి దిగారు. ఎల్-21 మైనర్ కెనాల్ విషయంలో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమ భూములకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు జీల సంపత్, జీల ఐలయ్య, జీల రవీందర్, జీల ధనేందర్, జీల మల్లేశం, జీల కుమారస్వామి, మంతెన బాబు, మంతెన మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

