హుజూరాబాద్‌టౌన్, మే16: వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ రైతులకు పిలుపునిచ్చారు. గురువారం హుజూ బాద్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నా య కులు రైతుదీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సన్నాలకే బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రా ష్ట్రంలోని 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. ఈ విషయం తెలిసి కూడా సీఎం రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడడం బాధాకరమన్నారు.
ఎన్నికల ముందు వడ్లు పండించే రైతులందరికీ బోనస్ వేస్తామని, ఓట్లు డబ్బాలో పడంగనే దొడ్డు వడ్లకు మాత్రమేనని చెప్పడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు, అన్ని రకాల వడ్లకు బోనస్ రూ.500 చె ల్లించాలని, మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరుఫున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కాగా, ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పడదం బకారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడూరు ప్రతాపరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, పీ లక్ష్మారెడ్డి, పీ దయాకర్‌రెడ్డి, కే కిరణ్‌గౌడ్, కె తిరుపతియాదవ్, ఎడ్ల విజయ్‌కుమార్, ఎల్లయ్య, బెల్లి రాజయ్య, వెంకటేశ్‌గౌడ్, సతీశ్‌గౌడ్, రఘుపతిరెడ్డి, శ్రీనివాస్, రవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.