సైదాపూర్, సెప్టెంబర్ 7: సైదాపూర్ మండల కేంద్రంలోని వెంకెపల్లి (Venkepalli) సింగిల్ విండో కార్యాలయం వద్ద రెండు రోజులుగా యూరియా (Urea) కోసం రైతులు బారులు తీరుతున్నారు. శనివారం ఉదయం టోకెన్ల పంపిణీ రసభసగా మారడంతో 330 బస్తాల యూరియాను పోలీస్ స్టేషన్కి తరలించారు. దింతో ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచే పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెప్పులు లైన్లో పెట్టారు. ఏఈవో, పోలీసులు, సిబ్బంది వచ్చి రైతులతో మాట్లాడారు. టోకెన్లు వున్న రైతులకు యూరియా ఇస్తామని, లేని వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వారికి తరువాత లోడ్లో యూరియా పంపిణీ చేస్తామన్నారు. గతంలో అసలు లైన్ లేకున్నా యూరియా అందేదని, ఇప్పుడు రోజుల తరపడి ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.