YouTuber Vaishnavi | కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.. ‘చెల్లీ లేవమ్మా..’ అంటూ సోదరుడి ఆర్తనాదాలు
కాలం కరగని గాయాన్ని మిగిల్చింది. విధి ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హత్యకు గురైన తన సోదరి ఇక లేదన్న నిజాన్ని ఆ అన్న మనసు అంగీకరించలేకపోతోంది.
YouTuber Vaishnavi | కోరుట్ల రూరల్: కాలం కరగని గాయాన్ని మిగిల్చింది. విధి ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హత్యకు గురైన తన సోదరి ఇక లేదన్న నిజాన్ని ఆ అన్న మనసు అంగీకరించలేకపోతోంది. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దృశ్యం చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.
చెల్లి సమాధి వద్దే నిరీక్షణ..
యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితురాలైన గంధం వైష్ణవి మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, తన ప్రాణ సమానమైన చెల్లి దూరమవ్వడాన్ని ఆమె సోదరుడు సంతోష్ తట్టుకోలేకపోతున్నాడు. గడిచిన మూడు రోజులుగా అతను వైష్ణవి సమాధి వద్దే గడుపుతున్నాడు.
పూలతో సమాధి అలంకరణ : తన చెల్లికి ఇష్టమని రంగురంగుల పూలతో ఆమె సమాధిని అలంకరించాడు. వైష్ణవికి ఇష్టమైన పండ్లు, ఆహార పదార్థాలను సమాధి వద్ద ఉంచి ‘చెల్లీ.. ఇవి తిను.. ఒక్కసారి లేవమ్మా’ అంటూ బతిమాలుతున్న తీరు చూపరుల హృదయాలను పిండేస్తోంది. ఆమెను తలచుకుంటూ సంతోష్ పాడుతున్న పాటలు ఆ గ్రామంలో విషాద ఛాయలను నింపాయి. గుండె కోత అనుభవిస్తున్న కుటుంబం వైష్ణవి మరణంతో ఆ కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఊహించని ఈ ఘోరకలితో తల్లిదండ్రులు, బంధువులు విలవిలలాడుతున్నారు. ఒక వెలుగు వెలగాల్సిన ఆడబిడ్డ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం మాదాపూర్ గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన నిజంగా ఎంతో కలచివేసేలా ఉంది. సంతోష్, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

