Eye donation | పోతంగల్, జూలై 10 : నేత్రదానం చేసి కుటుంబంలో మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చైతన్ నగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రమారాణి అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రమారాణి నేత్రాలను దానం చేసి మానవత్వం చాటుకున్నారు.
ముందుగా కుటుంబీకులు మల్లాది రాంబాబు, మల్లాది రంగబాబు విషయాన్ని లైన్స్ క్లబ్ అప్ బీర్కూర్ చైర్మన్ రమేష్ దృష్టికి తీసుకువెళ్లారూ. ఆయన బోధన్ లైన్స్ క్లబ్ ఆసుపత్రికి సమాచారం అందజేసి ఆమె నేత్రాలను డొనేట్ చేశారు. ఈ నేత్రాలతో ఓ ఇద్దరూ అంధులకు చూపు ఇచ్చే అవకాశం కలిగిందని రమారాణి కుటుంబ సభ్యులకు అభినందించి లైన్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.