Sarangapur | సారంగాపూర్, ఆగస్టు 3: పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆగస్టు 1 నుండి 7వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారులు పేర్కోన్నారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డలకు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకు కలిగే ప్రయోజనాలు, తదితర అంశాలపై ఆవాగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రసనలు. గర్భిణిలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోల్లు సురేంధర్, సుపర్ వైజర్ లత, కార్యదర్శి శ్రీనివాస్, ఆంగన్వాడి టీచర్లు, ఆయాలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.