కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 24: జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. పారమిత విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్ రావు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు క్రిస్మస్ చెట్టు తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అలాగే, పొన్నం కాంప్లెక్స్‌లో గల పారమిత లెర్నన్ ఫౌండేషన్ పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో పాఠశాల డైరెక్టర్లు రష్మిత, వినోద్ రావు, ప్రసూన, అనుకర్ రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాళ్లు ఆశువాద్వా, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కోరా హైసూల్లో క్రిస్మస్ వేడుకలను పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, హరికృష్ణ, సంతోష్ రెడ్డి కేక్ కట్ చేసి ప్రారంభించారు. క్రిస్మస్ విశిష్టత తెలిసేలా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మేరి, శాంతాక్లాజ్, షెపర్డ్, వైజ్ మ్యాన్ వేషధారణలో పిల్లల ప్రదర్శనలు అలరించాయి. అలాగే, హనుమాన్‌నగర్‌లోని బ్లూబెల్స్ పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ప్రత్యేక దుస్తుల్లో వచ్చిన విద్యార్థులకు కరస్పాండెంట్ జంగ సునీత-మనోహర్ రెడ్డి బహుమతులు అందజేశారు.
సిద్ధార్థ పాఠశాలల్లో..
మంకమ్మతోట, భగత్‌నగర్‌లోని సిద్ధార్థ హైస్కూల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తీసుకువచ్చిన బహుమతులు, గ్రీటింగ్ కార్డులతో క్రిస్మస్ ట్రీని అలంకరించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐటీ హబ్‌లో.. 
నగరంలోని ఐటీ హబ్‌లో గల ఇండస్ట్రీ ఏఆర్సీ సంస్థలో క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా సాగాయి. ఉద్యోగులు పరస్పరం సప్రైజ్ బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు తమ సంస్థ సీఈవో జాప వెంకట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ హెచ్ఆర్ వీ రవళి, ఐటీ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.
కార్పొరేషన్, డిసెంబర్ 24: అన్ని మతాల వారు పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానుకలు అందిస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. స్థానిక భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో వద్ద శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ తాతా వేషధారణలో ఉన్న ఆర్యన్ అనే చిన్నారికి మేయర్ స్వీట్లు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. నగరంలో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ యువకులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మండలంలోని పలు విద్యాలయాల్లో క్రిస్మస్ సంబురాలు జరుపుకొన్నారు. గోపాల్‌రావుపేటలోని అల్ఫోర్స్, అక్షర పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి, అక్షర పాఠశాల కరస్పాండెంట్ మినుకుల మునీందర్, ప్రిన్సిపాల్ రాధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని మానేరు పాఠశాలలో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను ముస్తాబు చేయడంతో పాటు క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించారు. పలువురు విద్యార్థులు శాంతాక్లాజ్, దేవదూతల వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్‌ను తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెహర్‌నగర్‌లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీప్రకాశ్రావు ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శాంతాక్లాజ్, మేరీ జోసెఫ్, షెప్పర్డ్స్, వైజ్మాన్ల వేషధారణలో క్రిస్మస్ ఇతివృత్తాన్ని తెలియజేశారు. పాఠశాల వైస్‌చైర్మన్ పృథ్వీరావు, ప్రిన్సిపాల్ శ్రీకాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
బిర్లా ఒపెన్ మెండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో..
కరీంనగర్ శివారులోని బొమ్మకల్ బైపాస్‌లో గల బిర్లా ఒపెన్ మెండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో క్రిస్మస్ కార్నివల్-2022 వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా వివిధ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.