Huzurabad | హుజూరాబాద్ టౌన్, జూలై 3: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు హుజరాబాద్లోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల వసతి గృహం సువర్ణావకాశాన్ని కల్పిస్తోందని హాస్టల్ వెల్ఫేర్ ఆపీసర్ సుమన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 200 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ వసతి గృహంలో ప్రస్తుతం కేవలం 30 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 170 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖాళీలలో ఎస్సీ విద్యార్థులకు 138 సీట్లు, ఎస్టీ విద్యార్థులకు 9 సీట్లు, బీసీ విద్యార్థులకు 20 సీట్లు, ఓసీ విద్యార్థులకు 3 సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన వసతి సౌకర్యాలతో కూడిన విద్యను పొందాలని ఆయన సూచించారు. హాస్టల్ లో విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు వారానికి ఆరు కోడిగుడ్లు, ఆరు అరటి పండ్ల తోపాటు వారానికి రెండు సార్లు చికెన్, నెలకు రెండు సార్లు మటన్, మినరల్ వాటర్, కంప్యూటర్, లైబ్రరీ, గీజర్, నెలకు రూ.500 పాకెట్ మనీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 9603880421 ఫోన్ నంబర్ నందు సంప్రదించవచ్చని సూచించారు.