Electricity workers | గంగాధర, జూన్ 4: గంగాధర మండలం ఆచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గర్శకుర్తిలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ ఉపేందర్, విద్యుత్ రైతులను కలిసి మాట్లాడారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు రైతులు సొంతగా మరమ్మతులు చేసుకోకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇస్తే పరిష్కరిస్తారని సూచించారు. రైతులు ప్రతీ ఒక్కరూ అధికారికంగా కనెక్షన్ తీసుకొని విద్యుత్ వినియోగించుకోవాలన్నారు.
లూజ్ లైన్లు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మ్ గద్దెలు, లైన్లు ప్రమాదకరంగా ఉంటే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని అన్నారు. విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకుంటేనే లాభదాయకమన్నారు. రైతుల సమస్యల పట్ల అధికారులు స్పందించకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో గంగాధర సబ్ డివిజన్ ఏడిఈ సత్యనారాయణ రెడ్డి, సెక్షన్ ఏఈ తోట రామ్మోహన్, లైన్ ఇన్స్పెక్టర్ నారాయణ, లైన్మెన్ శంకర్ విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.