pegadapally | పెగడపల్లి : పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేయగా ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
వారి వద్ద నుండి రూ.3950 నగదుతో పాటు ఆరు సెల్ ఫోన్లను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.