Koya Sri Harsha | పెద్దపల్లి, జనవరి3: ఉపాధ్యాయులు విద్యార్థులకు అభ్యన్నతి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శనివారం పూలే చిత్రపటానికి కలెక్టర్, జిల్లా అధికారులు పూల మాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని పేర్కొన్నారు.
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి ఉపాధాయుడు ప్రత్యేక చూపాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళ ఉపాధ్యాయులను, అంగన్వాడీ ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో డీఈవో శారద, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త మల్లేశం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.