Aakunuri Murali | వీణవంక, నవంబర్ 13: వీణవంక మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిస్థితులను, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలలోని కార్యక్రమాలు, చల్లూరు టాక్స్, లిటరరీ లాంథన్, ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై విద్యార్థి ఇచ్చిన స్పీచ్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని ఇంగ్లీష్ లైబ్రరీని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని విద్యావిధానం, చేపడుతున్న కార్యక్రమాలపై ఆరాతీశారు.
పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపట్ల హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వినీ తానాజీ వాంఖడే, డీఈఓ శ్రీరాం మొండయ్య, క్వాలిటీ కో ఆర్డినేటర్ వీ అశోత్రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య, తహసీల్దార్ అనుపమారావు, ఎంఈవో శోభారాణి, ఎంపీఓ సురేందర్, హెచ్ఎం సంపత్ కుమారచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.