Early Bathukamma celebrations | ధర్మారం, సెప్టెంబర్ 20: ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో అందంగా బతుకమ్మలను పేర్చారు. ఆయా పాఠశాలల్లో బోధిస్తున్న మహిళ ఉపాధ్యాయులతో పాటు బాలికలు కలిసి పాఠశాలల ఆవరణలో బతుకమ్మ ఆడారు. డిజె సాంగ్స్ పాటలకు అనుగుణంగా దాండియా ఆడారు.
బ్రిలియంట్ మోడల్ హై స్కూల్ చైర్మన్ సిరిపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో హై స్కూల్ నుంచి విద్యార్థులు బతుకమ్మలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో బ్రిలియంట్ మోడల్ స్కూల్స్ అధినేత సిరిపురం సత్యనారాయణ, స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్ మహేందర్, హెడ్మాస్టర్ రమాదేవి, సాందీపని ప్లే స్కూల్ కరస్పాండెంట్ పూస్కురు రామారావు, హెడ్మాస్టర్ పాములపర్తి శ్రీనివాస్, ఆయా పాఠశాలల మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.