Murder | కొడిమ్యాల. ఆగస్టు 8 : పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడించారు. ఈ సందర్భంగా నాచుపల్లి గ్రామానికి చెందిన మేనేని ప్రేమలతను దూరపు బంధువు అయిన సురభి రఘునందన్ రావు పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు తెలిపారు. వరుసకు ప్రేమలత రఘునందన్ రావు కు అత్త అవుతుందని, ప్రతీ చిన్న విషయానికి భూతులు తిట్టేది అని పేర్కొన్నారు.
ఈ నెల 6న జగిత్యాల కు పని నిమిత్తం వెళ్లిన ప్రేమలత రాత్రి 9 గంటల సమయంలో నాచుపల్లి గ్రామంలోని రావి చెట్టు కింద బస్సు దిగింది. ఇంటికి వెళ్తున్న సమయంలో రఘునందన్ రావు తన కోళ్ల ఫామ్ వద్ద పనులు చేసుకుంటుండగా మళ్లీ తిట్టడంతో కోపోద్రోకులైన రఘునందన్ రావు అక్కడే ఉన్న బండలు, కర్రతో తలపై బాదినట్లు తెలిపారు. దీంతో ఆమె వెంటనే ప్రేమలత తన ఫోన్ తో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎల్లయ్య కు ఫోన్ చేసి తనను రఘు కొడుతున్నాడని రావాలని కోరింది. అప్పటికే తీవ్ర గాయాలైన ప్రేమలత మృతి చెందగా ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడేసి వెళ్లాడు.
కాగా ఈ కేసు విషయంపై మృతురాలి ఫోన్ నంబర్‌ను ట్రెసింగ్ చేయగా ఎల్లయ్య కు చివరి ఫోన్ వెళ్ళిందని, గురువారం ఎల్లయ్యను విచారించగా రఘునందన్ కొట్టినట్లు ఎల్లయ్య ఫోన్ లో రికార్డైనట్లు పేర్కొన్నారు. నిందితుడి కోసం వేతకగా శుక్రవారం మండలంలోని దొంగలమర్రి చెక్ పోస్ట్ నుండి పారిపోతుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై సందీప్ తదితరులు ఉన్నారు.