Karimnagar | అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
Karimnagar | ముకరంపుర, జూన్ 4 : అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఒకటి నుంచి 7 వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాల భవన్, పలు విద్యాసంస్థలకు చెందిన 104 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, కరీంనగర్ రేంజ్ అధికారి ఎస్ కే షౌకత్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ అధికారి ఏ ఆనంద్ కుమార్, డీర్ పార్క్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

