జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 24: పేద ప్రజలకు సేవ చే యాలనే ఆకాంక్ష, అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే ముప్ఫై ఏండ్ల నుంచి పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, డాక్టర్ ఎం. సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పావని కంటి దవాఖానలో 12మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. అంతేకాకుండా కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరగా, దీంతో వెంటనే జగిత్యాలకు మెడికల్ కళాశాలను మంజూరు చే శారన్నారు. రూ.500 కోట్లతో కళాశాల భవన నిర్మాణ పను లు జరుగుతున్నాయన్నారు. మెడికల్ కళాశాలను మంజూరు చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రభు త్వ వైద్యశాలను సైతం అభివృద్ధి చేశామన్నారు.
వంద పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సైతం నిర్మించామని తెలిపారు. పట్టణంలోని జిల్లా ప్రధాన దవాఖానలో ఇప్పుడు వంద మంది వైద్యులు, నలుగురు కంటి వైద్య నిపుణులు పేదలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నారన్నారని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖాన వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు కంటిలో దుమ్ము, ధూళి పడకుండా జాగ్రత్తపడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్, కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, ప్రసాద్, దవాఖాన సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజల ప్రోత్సాహం, మద్దతుతోనే జగిత్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి విజయం వరించిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంక్షేమ సంఘం 2024 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెలమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా వృద్ధాశ్రమానికి రూ. 50లక్షలు విరాళంగా అందజేసిన గండ్ర మోహన్‌రావును ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్‌లో స్థలాలు ఇచ్చిన మాదిరిగానే జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం 18.5ఎకరాల స్థలాన్ని మంజూరు చేశామన్నారు. వెలమలు సమాజంలో అన్ని వర్గాలు, కులాలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. వృద్ధాశ్రమ నిర్మాణానికి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వారికి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కా ర్యక్రమంలో వెలమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు, సంఘం నాయకులు రాజేశ్వర్‌రావు, పురుషోత్తంరావు, హైకోర్టు ఆడ్వకేట్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేందర్‌రావు, సావిత్రి, కిషన్‌రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.