Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 03 : భవిత సెంటర్ కు దివ్యాంగ విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. భవిత సెంటర్ లో రిజిస్టరైన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు భవిత సెంటర్ కు రావాలని అన్నారు. వారం రోజులలో రెండు సార్లు విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయనున్నట్లు చెప్పారు. భవిత సెంటర్ లో దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు.
భవిత సెంటర్ లో చదివే దివ్యాంగ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రూ.5 వేల స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపారు. దీనిని ప్రతీ దివ్యాంగ విద్యార్థులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, జిల్లా విద్యాశాఖ అధికారి శారద, ఎంఈవో సురేందర్ కుమార్, ఎస్వో కవిత, ఐఆర్పీలు సంధ్యా రాణి, రజిని, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.