కోనరావుపేట/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/ సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22: ప్రతిఒక్కరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను శనివారం ఆమె తహసీల్ ఆఫీస్లో 300 మంది క్రైస్తవులకు పంపిణీ చేశారు. తర్వాత క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీ నరసింహాచారి తదితరులు ఉన్నారు.