Odela | ఓదెల, ఆగస్టు 4 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామంలో ఇంటింటికి పండ్ల మొక్కలను సర్పంచ్ పిట్టల రవికుమార్ మంగళవారం పంపిణీ చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా ఇంటి ఇంటికి పండ్ల మొక్కలను అందజేశారు. గ్రామంలో విరివిగా చెట్లు ఉండడం వల్ల ఆహ్లాదకర వాతావరణంతో పాటు మంచి గాలి దొరుకుతుందని పేర్కొన్నారు.
అలాగే ఇళ్లల్లో పండ్ల మొక్కల పెంపకం వల్ల మంచి పండ్లను తినే అవకాశం దొరుకుతుందని అన్నారు. ప్రతీ ఇంటిలో చెట్ల పెంపకాన్ని చేపట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమూల్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.