ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
99 మందికి చెక్కుల పంపిణీ
కార్పొరేషన్, ఫిబ్రవరి 25: పేదింట కల్యాణ కాంతులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని చెకులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసి పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. కరోనా కాలంలో కూడా కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను కొనసాగించిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని 20 మందికి రూ. 20,02,320 లక్షలు, కరీంనగర్ రూరల్ మండలంలోని 22 మందికి రూ. 22,02,552 లక్షల, కరీంనగర్ అర్బన్ మండలంలోని 57 మందికి రూ. 57,06,612 లక్షల విలువైన చెకులను మంత్రి పంపిణీ చేశారు. మొత్తం 99 మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 లక్షల చెకుల విలువైన అందించారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి మనిషిలా సాయం జేసిన్రు
ఒక ఇంటి మనిషిలా ప్రభుత్వమే ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషమ నిపిస్తుంది. ఇలాంటి ప్రభుత్వం మరింత కాలం ఉండాలి. పేదల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ మాకు ఎంతో సాయం జేసిన్రు. ఆడబిడ్డ పెళ్లి చేసి అవస్థలు పడకుండా డబ్బులు అందిస్తున్న ప్రభుత్వాలు గతంల ఏవీ లేవు. ఇలాంటి సీఎంకు మేం ఎప్పటికీ అండగా ఉంటం.
– లక్ష్మి, కట్టరాంపూర్