Distribution | కాల్వశ్రీరాంపూర్ 19 : కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి తల్లిదండ్రులు బాల చంద్రమ్మ-ఐలయ్యల జ్ఞాపకార్థం గ్రామంలోని మహిళలందరికీ కోలలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోలలను పంపిణీ చేసిన శివప్రసాద్‌ను మహిళలు, నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడి అశోక్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కు మధూకర్, గుడ్ల శ్రీనివాస్, అనుముల రాజిరెడ్డి, బక్కల రామన్న, చీర ఓదెలు, రానవేన రామస్వామి, కూస సతీష్, నోముల కిరణ్, జాల్ల రాజ్ కుమార్, నోముల శ్రీనివాస్, జంగిలి రాజేష్, చీర్లంచ రమేష్, గుడ్ల నరేష్, బండారి సంపత్, గుడ్ల సతీష్, జంగిలి కుమార్ , గాజుల రాజేందర్, జంగిటి రాజయ్య, పోలోజు శ్రీనివాస్, బైరి రాజవీరు, సుంకరి కట్టయ్య,సుంకరి మల్లయ్య, జంగిలి కుమార్ తదితరులు పాల్గొన్నారు.