Henna | రుద్రంగి, జూలై 5 : రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆషాడమాసం సందర్భంగా శనివారం పాఠశాలలోని మొత్తం విద్యార్థినిలకు గోరింటాకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ మన భారతదేశ సంప్రదాయమైన ఈ ఆషాడమాసంలో గోరింటాకు చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల జూన్, జూలై మాసంలో వచ్చే వాతావరణ మార్పులకు మానవ శరీరంలో వచ్చే మార్పులకు సమతుల్యంగా ఉంచడానికి, క్రిమికీటకాల నుండి రక్షణ పొందడానికి ఈ గోరింటాకు ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, పాఠశాల డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పడాల సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.