తిమ్మాపూర్ రూరల్ ఫిబ్రవరి12: ఎల్ఎండీ కాలనీలో గల జిల్లా విద్యా శిక్షణ సంస్థలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీసూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 14న మూడో విడుత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య తెలిపారు.
డీసెట్-2023లో ఉత్తీర్ణులై ఒరిజినల్ ధ్రువ పత్రాల పరిశీలన చేయించుకోని వారు ఎల్ఎండీ కాలనీలో లోని డైట్ కళాశాలలో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని కోరారు. మరిన్నీ వివరాలకు డీ సెట్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు .