State-level competitions | ధర్మారం,సెప్టెంబర్ 7 : రాష్ట్రస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలువురు విద్యార్థులు ప్రతిభను కనభరిచారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్ నేషనల్ షావోలిన్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 వ రాష్ట్రస్థాయి కుంగ్ పూ, కరాటే పోటీల్లో ధర్మారం మండలంలోని బోట్లవనపర్తి కి చెందిన డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమీ విద్యార్థులు పలు విభాగాల్లో రాణించి పథకాలు సాధించినట్లు డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమి మాస్టర్ లింగంపల్లి రమేష్ తెలిపారు.
అల్ కలర్ బెల్ట్ అండర్ -10 కటాస్ విభాగంలో పసుపునూటి జయ్ గోల్డ్ మెడల్, అండర్- 12 కటాస్ విభాగంలో పసుపునూటి అద్విక్ గోల్డ్ మెడల్,బాలికల అండర్ -9 కటాస్ విభాగంలో జల్ల అర్చిత గోల్డ్ మెడల్ సాధించారు. విజేతలను డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమీ ఫౌండర్, గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, ప్రెసిడెంట్ రాజేందర్, జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్, సీనియర్ మాస్టర్లు చందు, వెంకటస్వామి అభినందించారు.