Dharmapuri | ధర్మపురి : బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన మందపల్లి నరసవ్వ (79) అనే వృద్ధ మహిళ అనుకోకుండా గ్రామం నుంచి తప్పిపోయి కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్పోస్ట్ వద్ద గస్తీలో ఉన్న పోలీసులు ఆమెను గుర్తించి మాట్లాడారు.
కాగా ఆమె తన గ్రామం రేకులపల్లికి చెందినదిగా దారి తప్పి ఇక్కడకు వచ్చానని చెప్పారు. వెంటనే సంబంధిత బంధువులను సంప్రదించి వారి సమక్షంలో ముసలమ్మను వారికి క్షేమంగా అప్పగించారు. పోలీసులు ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రతీ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని స్పందిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసుల చొరవ, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును స్థానికులు అభినందించారు.