Devunipalli temple | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 1 : పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రధాన పూజారి కొండపాక లక్ష్మినృసింహచార్యుల పదవీ విరమణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు స్థానిక దేవాలయ అవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై దేవాలయానికి పూజారిగా కొండపాక లక్ష్మినృసింహాచార్యులు 40 ఏళ్లుగా చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అర్చకులు, పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.