Development works | పెద్దపల్లి రూరల్, జూన్ 16 : ప్రజావసరాలకోసం,ప్రజలఆలోచనల మేరకే అవసరమైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, 12 లక్షలతో అంగన్ వాడీ భవనం, తుర్కలమద్దికుంటలో రూ.29 లక్షలతో వివిద పద్దుల కింద మంజూరైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని తాము చెరువుల్లో మట్టిని, మానేరులో ఇసుకను అమ్ముకునేటోళ్లం కాదని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ అవసరమైనన్నీ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి సరిపడే విదంగా ఇండ్లు తీసుకోచ్చి కట్టిచ్చే బాధ్యత మీ విజ్జన్నగా నాది అని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, నాయకులు ఎనగందుల ప్రదీప్ , నారాయణ, గిరినేని సంపత్ రావు, మాదారపు ఆంజనేయరావు, ఏడెల్లి శంకరయ్య, సందనవేని రాజేందర్ యాదవ్ , బండారి రామ్మూర్తి, నూగిల్ల మల్లయ్య, కలబోయిన మహేందర్ , కట్కూరి సుదాకర్ రెడ్డి, పెగడ రమేష్ యాదవ్ , గోగు రాజన్న యాదవ్, దొంత రాజయ్య , నరేష్ , సంపత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధి దారులకు అందజేశారు.