GodavariKhani | ‘ఉపా’ రద్దు చేయాలని డిసెంబర్ 10న చలో ఢిల్లీ.. గోదావరిఖనిలో పౌరహక్కుల సంఘం నేతల పిలుపు
కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టంను రద్దు చేయడంతోపాటు పౌరుల స్వేచ్ఛ అయిన ఓటు హక్కును తొలగించే అధికారం ఎవరికీ లేదనీ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలనీ, పది మంది ఆదివాసీలకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని రామగుండం పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
GodavariKhani | కోల్ సిటీ, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టంను రద్దు చేయడంతోపాటు పౌరుల స్వేచ్ఛ అయిన ఓటు హక్కును తొలగించే అధికారం ఎవరికీ లేదనీ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలనీ, పది మంది ఆదివాసీలకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని రామగుండం పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. డిసెంబర్ 10న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడారు. ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా దేశంలోని 16 హక్కుల సంఘాలతో ఏర్పడిన ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సీడీఆర్ఓ) పిలుపులో భాగంగా డిసెంబర్ 10న ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్న సదస్సుకు పెద్దపల్లి జిల్లా నుంచి పౌర హక్కుల నేతలు, మేధావులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ప్రజల హక్కులు, పౌరసత్వం కోల్పోయే అప్రజాస్వామిక సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కేంద్రంను డిమాండ్ చేశారు. దేశంలో అత్యంత క్రూరమైన ప్రజాస్వామిక వ్యతిరేక ఉపా చట్టంను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా మేధావి వర్గం డిమాండ్ చేస్తుందన్నారు. దేశంలో 1928 నుంచి 1944 వరకు 11,539 మందికి మరణ శిక్ష విధించారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకూరు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రవి, వినోద్, బండారు రాజలింగు. సత్యనారాయణ, శంకర్, గుమ్మడి కొమురయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

