Peddapally | పెద్దపల్లి రూరల్, జనవరి 17 : పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా లోనే పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమై సంచలం సృష్టించిన రికార్డును మరువక ముందే పాలకవర్గం మరో అడుగు ముందుకేసి కఠినమైన తీర్మాణాలు చేసి మరో సంచలనం సృష్టించి ఆదర్శం వైపు అడుగులు వేస్తోంది. సర్పంచ్ కనపర్తి సంపత్ రావు ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి గ్రామసభలోనే కఠినమైన తీర్మాణాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తీర్మాణించుకోవడం మరో సంచలన నిర్ణయంగా మారింది.
ఈ తీర్మాణాలను పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో వెల్లడించడం హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తంజావూరు సోనియా, మాజీ సర్పంచులు కనపర్తి శ్రీలేఖ ప్రభాకర్ రావు, ముష్కే సుధ నర్సింగం, ఉపసర్పంచ్ మడుపు విజయలక్ష్మి, ఏఎస్సై తిరుపతి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.