National Rowing Championship | జ్యోతినగర్, మే 31: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వేదికగా ఈ నెల 27 నుంచి 31వరకు జరిగిన 26వ సబ్ జూనియర్ నేషనల్ రోవింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీపీసీ మాతంగికాలనీకి చెందిన చిప్ప దాత్రి అండర్-13 విభాగంలో బంగారు పతకం సాధించింది.
ఈ పోటీలకు 23 రాష్ట్రాల నుంచి 360మంది పాల్గొనగా, తెలంగాణ నుంచి 24మంది క్రీడా విద్యార్థుల్లో దాత్రి హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్ తరుపున ఏడో తరగతి చదువుతూ ద్రోణచార్య అవార్డు గ్రహిత భారత్ చీఫ్ కోచ్ పర్యవేక్షణలో పోటీలో ప్రతిభకనబరిచి బంగారు పతకం సాధించడం పట్ల స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు చిప్ప నిరంజన్ శివప్రసాద్, చిప్ప సుభాషిణి సంతోషం వ్యక్తం చేశారు.