Vemulawada | వేములవాడ, జూలై 24 : వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ల ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివుడు, శివపార్వతుల చిత్రాలును స్థానికుడు అంజయ్య వేయించారు.
అయితే వేములవాడలోని జాతర గ్రామంలోని ప్రధాన వీధి కావడంతో రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో పాటు స్థానికులు పాత గోడల పక్కన చెత్తాచెదారం వేయడంతో దోమలతో పాటు దుర్వాసన వస్తుందని వెల్లడించారు. అయితే దేవుడి చిత్రాలను వేయించి ఇక చెత్తకు చెక్ పెట్టారు. స్థానిక కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ సదర చిత్రాలు వేయించిన అంజయ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు.