Bhimeshwara temple | వేములవాడ, డిసెంబర్ 29: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి తొలిముక్కులు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నుండి సమ్మక్క జాతర నిర్వహిస్తుండగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. ఇందులో భాగంగా భారీగా భక్తులు తరలి వస్తుండగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేశారు.
ఆదివారం వేకువజాము నుండి మొదలుకొని సోమవారం ఉదయం వరకు నిరంతరంగా భక్తులకు దర్శనాలు కల్పించారు. కోడేమొక్కు కోసం ప్రధానంగా భక్తులు బారులు తీరుతున్నారు. కోడె మొక్కు కోసం సుమారు రెండు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. సమ్మక్క భక్తుల తాకిడితో భీమేశ్వర ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.