Rajanna temple | వేములవాడ, జూన్ 7: వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు. కోడె మొక్కు చెల్లించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వేసవి కాలాన్ని తలపిస్తున్న ఎండలతో క్యూ లైన్ లో గంటలకు కొద్దిగా వేచి ఉండడం ద్వారా మహిళలు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎక్కడికక్కడ ఎండకు సేద తీరేందుకు నెత్తిన కొంగు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోయారు. మరోవైపు తాగునీరు కూడా అందకపోవడంతో వృద్ధులు చిన్నారులు అవస్తలపాలయ్యారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు కోడె ముక్కు చెల్లించుకున్న భక్తులను ఆంజనేయస్వామి గేటు వద్ద నుండి లోనికి అనుమతిస్తుండగా ఒక్కసారిగా భక్తులు తరి రావడంతో తోపులాట జరుగుతుంది. రాజన్న ఆలయం మూసివేస్తారన్న ప్రచారంతో ప్రతినిత్యం 20వేలకు పైగా భక్తులు స్వామివారి సన్నిధి తరలివస్తుండగా ఆలయ పరిసరాలు కూడా కిటకిటలాడుతున్నాయి.