MLA Padi Kaushik Reddy | వీణవంక, జూన్ 19: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిర్రెడ్డిపై వ్యక్తి దూషణలు, నిరాధారమైన విమర్శలు, ఆరోపణలు చేయడమే కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు మిగిలిన ఆఖరి ఆయుధంగా కనిపిస్తోందని అన్నారు.
ప్రజల విశ్వాసంతో గెలిచిన నాయకుడు కౌశిక్ రెడ్డిఅని, తాతల, తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, హుజూరాబాద్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కౌశిక్ రెడ్డిలో ఉన్న నాయకత్వాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా, విప్‌గా అవకాశం ఇచ్చారని, హుజూరాబాద్‌లో రూ.కోట్లాది అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకి మీ నాయకత్వం మీద నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నారని, ఒక వార్డు మెంబర్ గా గెలవలేని వారు కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం కొత్తేమికాదని, హుజూరాబాద్ ప్రజల పక్షాన ఆయన పోరాటం ఆగదని, ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురిచేయడం మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు బొబ్బల శ్రీధర్ రెడ్డి, చరణ్, భార్గవ్, ఎడ్ల రాకేశ్, శ్రీకాంత్, రఘువరన్, నాగరాజు, మర్రి క్రాంతి, రాహుల్, రాజశేఖర్, వినయ్, రాజిరెడ్డి, దిలీప్, మహేశ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.