CPS policy | సైదాపూర్ : సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తపస్ మండల అధ్యక్షుడు ధ్యావనపల్లి శ్రీకాంత్ రావు అన్నారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని స్థానికి తహసీల్దార్ శ్రీనివాస్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
అనంతరం ధ్యావనపల్లి శ్రీకాంత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీపీఎస్ విధానం రద్దు చేసే అవకాశం వచ్చిన అప్పటి ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జీవో నెంబర్ 28 ద్వారా సీపీఎస్ విధానంలో కొనసాగుతామని చెప్పడం బాధాకరమన్నారు. ఆగస్టు 23 సీపీఎస్ ఉద్యోగులకు చీకటి దినంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వీ శివకుమార్ శివకుమార్, తపస్ జిల్లా నాయకులు సుధాకర్ దేవేందర్ పోగుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.