వీర్నపల్లి, ఆగస్టు 9: వైద్య విద్యార్థి ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ భ రోసానిచ్చారు. రంగంపేటకు చెందిన వైద్య విదా ్యర్థి మాలోత్ ప్రవీణ్ ఆదిలాబాద్‌లోని శివఘట్ వద్ద కాంత వాగులో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ప్రవీణ్ కుటుంబ సభ్యులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి పరామర్శించారు. ప్రవీణ్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటాడనుకునేలోపే ఈ ఘోరం జరిగిందని ప్రవీణ్ తల్లిదండ్రు లు లక్ష్మి, ఉస్మాన్ గుండెలవిసేలా రోదించగా, వా రికి వినోద్ ధైర్యం చెప్పారు. జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూల, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, సర్పంచ్ నందగరి లింగం, జ డ్పీ కో అప్షన్ చాంద్‌పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జల రాజిరెడ్డి, బంజార సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేశ్‌నాయక్, ప్యా క్స్ వైస్ చైర్మన్ తాటిలెంక ప్రభాకర్, యూత్ మం డల ఉపాధ్యక్షుడు పొన్నం దేవరాజు, సంతోష్, సేవ్యానాయక్, దేవరాజు, బుగ్గయ్య, ఉన్నారు.