Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | ఎల్ నినో ప్రభావం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
ధర్మారం : ఎల్ నినో ( El Nino ) ప్రభావం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ముదిరాజ్ వీధిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపాన్ని శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎల్ నినో తీవ్రతను ఎలా ఎదుర్కోవాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth reddy ) కి ప్రణాళిక లేదని విమర్శించారు. పంటలను కాపాడడంతో ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తీవ్ర వర్షాభావం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నప్పటికీ , కేసీఆర్కు ప్రతిష్ట పెరుగుతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేయలేదని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు ఆలోచన వల్ల వందల టీఎంసీల కొద్దీ గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలైనాయని వివరించారు. కేవలం వ్యక్తిగత స్వలాభం కోసమే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతున్నారని ఈశ్వర్ ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు నారా ప్రేమ్ సాగర్, ఉప్పరి శ్రావణి మహేష్, ఆర్బీఎస్ మాజీ మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య, జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు, దొంగతుర్తి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య, ధర్మారం మాజీ ఉప సర్పంచ్ ఆవుల లత, పార్టీ మహిళా నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ, రేగుల లక్ష్మి , పార్టీ నాయకులు నాడెం శ్రీనివాస్, బండవరం సుమన్, రాగుల చిన్న మల్లేశం, వేల్పుల కుమార్, గుమ్ముల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

