కార్పొరేషన్, అక్టోబర్ 3: ‘కాంగ్రెస్, బీజేపీలకు అధికారయావ తప్ప, ప్రజా సేవపై శ్రద్ధ లేదు. బీ ఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుంటే, ప్రగతిబాటలో పయనిస్తుంటే ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నరు. అసత్య ప్రచారం చేస్తున్నరు. వారి మాట లు నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పా ర్టీల నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్ర మే స్థానికంగా కనిపిస్తరు. వారితో జాగ్రత్తగా ఉం డాలని’ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు సూ చించారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతిపక్ష పా ర్టీల నుంచి పుస్తెలు కాజేసే వారు, భూ కబ్జాకోరు లు, 50కి పైగా కేసులున్నవారు వస్తున్నారని, వారి ని నమ్మితే తెలంగాణను అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.
మంగళవారం కరీంనగరంలోని 3వ డివిజన్లోని కిసాన్‌నగర్‌లో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం స్థానిక నాకాచౌరస్తాలో రూ.8.48 కోట్లతో నగరంలోని 7.670 కిలోమీటర్ల ప్రధాన రహదారుల మరమ్మతులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులను న మ్మి అధికారం కట్టబెడితే తెలంగాణ సంపదను దో చుకుని మళ్లీ గుడ్డిదీపం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి పాలనలో కరీంనగర్ అభివృద్ధి చెందిందో..? ఇంకా అభివృద్ధి చెం దుతుందో..? ఆలోచించుకోవాలని సూచించారు. నగరంలోని రోడ్లన్నీ తళతళలాడన్నదే తన ధ్యేయమని, ప్రయాణం సాఫీగా సాగాలన్నదే తన అభిమతమన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, నిధుల కొరత లేదని, ఎన్ని కోట్లయినా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రతి దళిత బిడ్డకు దళితబంధు అందిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు కిసాన్నగర్ను చిన్నచూపు చూశారని, ఇక్కడ ఏరోడ్డు చూసినా గుంతలమయంగా, తాగునీటికి ఇబ్బందులు పడ్డ రోజు లు ఉండేవన్నారు. కానీ స్వయం పాలనలో కిసాన్‌నగర్ రూపురేఖలు మార్చామని, టవర్సరిల్ నుంచి కిసాన్‌నగర్ మీదుగా రైల్వే స్టేషన్ దాకా సుందరమైన రోడ్డును నిర్మించామన్నారు. ఎకడైనా రోడ్లు కావాలని అడిగితే మూడు రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే సీఎం కేసీఆర్ పాలన కొనసాగాలన్నారు.
బీఆర్ఎస్ రిమోట్ తెలంగాణ ప్రజలైతే, కాంగ్రెస్, బీజేపీల రిమోట్ ఢిల్లీ పాలకుల చేతిలో ఉంటుందన్నా రు. మనం తప్పుచేస్తే మన భవిష్యత్ తరాల నో ట్లో మన్ను కొట్టినట్టు అవుతుందన్నారు. ఇది ఎన్నికల సమయమని, కాంగ్రెస్ నుంచి కొత్త ముఖా లు వస్తున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నగరంలో 240 కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్లను నిర్మించామన్నారు.147 కిలోమీటర్ల రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రూ.133 కోట్ల సీఎం హామీ నిధులతో నగరంలోని ఏ డివిజన్లో చూసినా అభివృద్ధి పరుగులు పెడుతున్నద ని తెలిపారు. నెలరోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత, గుగ్గిల్ల జయశ్రీ, నాంపెల్లి శ్రీనివాస్, నాయకులు పెండ్యాల మహేష్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ షమీ, ఆరె రవి, శ్రీధర్, సతీశ్ ఉన్నారు.