Tribal association leader | పెగడపల్లి: గిరిజన బంజారాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆందోళన చేపడుతామని గిరిజన సంఘం ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి నగావత్ జీవన్ నాయక్ హెచ్చరించారు. పెగడపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఎస్టీ జాబితా నుండి గిరిజన బంజారాలను తొలగించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. గిరిజన బంజారాలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని జీవన్ నాయక్ స్పష్టం చేశారు.