Dharmaram | ధర్మారం, ఏప్రిల్26: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అమానుషంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం బంద్ నిర్వహించగా సంపూర్ణంగా వ్యాపారస్తులు, ప్రజలు పాటించారు.
మండల కేంద్రంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కిరాణా దుకాణాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ స్థానికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు.