MLC Elagandula Ramana | జగిత్యాల, జూలై 19 : సంపూర్ణ ఆరోగ్యం కోసం దంత సంరక్షణకు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలని పాటించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. ఎల్జీ రాం హెల్త్ కేర్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ సౌజన్యంతో శనివారం జగిత్యాల మండలంలోని కండ్లపల్లి మోడల్ స్కూల్ లోని విద్యార్థులకు దంతాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఎల్జీ రామ్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. నిరుపేదల కోసం ఉచిత వైద్యం అందించాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా నేడు పిల్లలకు, విద్యార్థులకు ఆరోగ్యం పైన దృష్టి పెంచుకోవాలని సదుద్దేశంతో ఆరోగ్యవంతమైన దంతాలు మీద అవగాహనపై దంత వైద్య నిపుణులతో అవగాహన సదస్సు కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగిందని రమణ వెల్లడించారు. ఉపాధ్యాయులు విద్యను ఏ విధంగా అందిస్తారో అలాగే వైద్యులు కూడా మన ఆరోగ్య జీవన శైలిని జీవన విధాన్ని మార్చుకునేది కూడా వైద్యులు తెలియజేస్తారన్నారు. మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి దంతాలు, కళ్ల అని వాటిని సున్నితంగా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉండే విధంగా పాటించాలన్నారు.
విద్యార్థులు ఉదయం లేవగానే చక్కగా బ్రష్ చేసుకుని పద్ధతిగా దంతాలను శుభ్రపరచుకోవాలని దంతాలు సరైన పద్ధతిలో శుభ్రపరచుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురైతాయని అన్నారు. వాటిపై అవగాహన కార్యక్రమం డెంటల్ డాక్టర్ తో నిర్వహించారు. 800మంది విద్యార్థిని విద్యార్థులకు టూత్ బ్రశ్, పేస్టు, టంగ్ క్లీనర్లను పంపిణీ చేశారు. డాక్టర్లు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసుకొని పిల్లలందరికీ దంతాల సమస్యల గురించి స్క్రీనింగ్ చేస్తూ వాటికనుగుణంగా ఉచితంగా మందులు అందించారు.పిల్లలందరూ దంత సమస్యలు రాకుండా దంతాలు ఏ విధంగా కాపాడుకోవాలని డాక్టర్లు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రాము, ఎంఈవో గాయత్రి, సివిల్ హాస్పిటల్ ఆర్ఎంఓ సుమన్ మోహన్ రావు, శ్రీపతి, సెక్ట్రోరియల్ అధికారి రాజేశ్, ప్రిన్సిపల్ సరితదేవి, వైస్ ప్రిన్సిపాల్ నాగేష్ ఉపాధ్యాయులు, డాక్టర్లు ఎస్ కల్యాణ్ కుమార్, టీ అమిత రెడ్డి ఎల్వై జయంతి, ఎన్ లావణ్య, ఎల్ మణికంఠ, ఎల్ శ్రీనివాస్, ఎల్ కార్తికేయ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆయిల్నేని సాగర్ రావు, కండ్లపెల్లి మాజీ సర్పంచ్ చందా శేఖర్ రావు, వొళ్ళేం మల్లేశం, వొళ్ళాల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి కోరుకంటి రాము, కుడిక్యాల సర్వేశ్వర్, గంగిపెల్లి వేణు మాధవ్, కునమల్ల రాజం, గంగిపెల్లి శేకర్, పెండం గంగాధర్ పాల్గొన్నారు.