జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం రాయికల్ మండలం అల్లీపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులు, పిల్లలకు అందిస్తున్న సేవలను అడిగితెలుసుకున్నారు.
స్టేడియో మీటర్ ద్వారా స్వయంగా పలువురు పిల్లల ఎత్తును కొలతవేసి రికార్డుల్లో నమోదు చేయించారు. ఎత్తుకు తగిన బరువు లేనివారికి బాలమృతం ప్యాకెట్లు ఇవ్వాలని సూచించారు.
– రాయికల్, జూన్ 26