karimnagar | కమాన్ చౌరస్తా, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యావాహిని-బడిబాట పేరుతో రూపొందించిన పాటను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.
ఈ పాటను కాండూరి వెంకటేశ్వర్లు రచించగా కేబీ శర్మ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, తెలుగు ఉపాధ్యాయులు నంది శ్రీనివాస్ ఉన్నారు.