కలెక్టరేట్, మే 20: అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆయా సూళ్లలో మరమ్మతు పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారుల ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ల్లో చేయాల్సిన మరమ్మతులపై కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో జిల్లాలోని ఈఈలు, ఎంపీడీఓలు, ఏఈలతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
పాఠశాలల్లో నీటి సరఫరా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదొడ్ల మరమ్మతు, నీటి సదుపా యం, పాఠశాలల ఆవరణలో మరమ్మతులు ఏ మేరకు పూర్తయ్యాయో చర్చించారు. నాణ్యతతో నిర్మాణాలు చేయించాలని, ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని సూ చించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో గడువులోగా పనులు పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈవో రమేశ్‌కుమార్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, డీపీవో వీరబుచ్చయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావ ణ్య, అన్వేష్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.