Kaushika Hari | అంతర్గాం, జూలై 13 : సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. తొలి సీఎం కేసీఆర్ పై సీఎం రెవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, కన్నేపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కు నింపాలని డిమాండ్ చేస్తూ కౌశిక హరి ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తొలి సీఎం కేసీఆర్ చిత్రపటంకు పాలాభిషేకం చేశారు. అనంతరం రామగుండంలో రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి గొప్ప నీటి వనరులు సృష్టించారని, కానీ, రేవంత్ ప్రభుత్వం అదే ప్రాజెక్టుపై మూర్ఖపు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. రైతుల కోసం రక్తం ధారపోయడానికి తాము సిద్ధమేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ‘ఎంత రక్తం చల్లుతావో చల్లు.. తామంతా రక్తం ఇవ్వడానికి సిద్ధమే’ అంటూ.. కేసీఆర్ ను బాదానం చేసే కుట్రలు మానుకోవాలన్నారు. సీఎం ఇక నైనా ఇలాంటి రక్తపిశాచాల ప్రవర్తనను మాను కోవాలని హితవు పలికారు. కన్నేపల్లి పంప్ హౌజ్ అన్ చేసీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కు నీళ్లతో నింపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో నాయకులు కౌశిక లత, కొలిపాక మధుకర్ రెడ్డి, జేవీ రాజు, పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.