చొప్పదండి, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. జువ్వాడి చుక్కారావు మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, మండలంలోని అన్ని గ్రామాల్లో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, సర్పంచులు గుంట రవి, శంకర్, లావణ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గుర్రం నందిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, మహేశుని మల్లేశం, బీసవేని రాజశేఖర్, చోటు, వేణు, నరేశ్రావన్, మావురం మహేశ్, సీపెల్లి గంగయ్య, కుమార్ పాల్గొన్నారు.
గంగాధర, ఫిబ్రవరి 17: మండలంలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ‘శుభమస్తు’ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, మెన్నేని రాజనర్సింగారావు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, పులి వెంకటేశ్‌గౌడ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎండీ నజీర్, జోగు లక్ష్మీరాజం, రాసూరి మల్లేశం, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, అట్ల శేఖర్‌రెడ్డి, రామిడి సురేందర్, వేముల అంజి, అలువాల తిరుపతి, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, ముద్దం నగేశ్, సముద్రాల అజయ్, బెజ్జంకి కల్యాణ్, గంగాధర కుమార్, పెంచాల చందు, మ్యాక వినోద్, గంగాధర శ్రీకాంత్, గంగాధర వేణు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్ నాయకుడు బండారి శ్రీనివాస్ చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇక్కడ నాయకులు పొత్తూరి సుధాకర్, పొత్తూరి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఫిబ్రవరి 17: రామడుగు మండలం వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, పార్టీ మండల నాయకులు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. అనాథ చిన్నారులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కేక్ తినిపించారు. కాగా, గంగాధర మండలం కురిక్యాలలో చేపట్టిన మెగా రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొడిమ్యాల రాజేశం, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు శనిగరపు అర్జున్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, మాజీ ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బత్తిని తిరుపతిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, వీర్ల రవీందర్రావు, చాడ శేఖర్‌రెడ్డి, వంచ మహేందర్‌రెడ్డి, ఆరపెల్లి ప్రశాంత్, పూడూరి మల్లేశ్, సురేశ్, పెంటి శంకర్, చిమ్మల్ల మహేశ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. మహిళా ఉద్యోగులకు కేక్ తినిపించారు. ఇక్కడ ఏపీవో రాధ, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కార్యదర్శి మమత, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 17: కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఉపాధిహామీ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షురాలు కూన శారద, ఏపీవో శోభారాణి, రాధ, రాణి, ప్లాంటేషన్ మేనేజర్ సత్యనారాయణ, ఈసీలు రాజయ్య, రాజు, లక్ష్మారెడ్డి, అంజయ్య, సాంకేతిక సహాయకులు మమత, మహేందర్, సత్యానందం, సునీల్, పద్మ, కంప్యూటర్ అపరేటర్ కిషన్, సతీశ్‌కుమార్, రమణ, తదితరులు పాల్గొన్నారు.