Appointed | మల్లాపూర్, జూలై 25 : త్రేతాయుగ చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్గా శీలం రవి నియమితులయ్యారు.
గుట్టపై వెలసి, ప్రతీ ఏటా శివరాత్రి, శ్రావణ మాస ఉత్సవాల్లో వేలాదిమంది భక్తుల పూజలందుకునే ఈ ప్రాచీన ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కట్టుబడి ఉంటుందని చైర్మన్ లక్ష్మీ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన కమిటీ సభ్యులు డంగురాల సంతోష్, ఇస్తారివాడ రజిత, సాల్వాపూర్ రఘు, నేరెళ్ల లక్ష్మి, ఏటకంటి నరసయ్య, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.