Jagityal | జగిత్యాల, జూన్ 15 : ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణ-లక్ష్మణ్ కోరారు. అమ్మ మాట-అంగన్వాడీ బాటలో భాగంగా జగిత్యాల ప్రాజెక్టులోని అర్బన్ మూడవ సెక్టార్ పరిధిలోని 48వ వార్డు గంజిరోడ్ అంగన్వాడీ సెంటర్లో సోమవారం అంగన్వాడీ బాట కార్యక్రమంలో కౌన్సిలర్ కొండా అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించడం వల్ల ఆటపాటలతో విద్యతో పాటు పౌష్టికాహారం ఆరోగ్య పరీక్షలు అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి తల్లులు, పిల్లలు, కిషోర బాలికలతో పాటు అంగన్వాడీ బాట ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప రాణి, అంగన్వాడీ టీచర్లు తిరుమల దేవి, షాహిన్ సుల్తానా, రిజ్వానా బేగం, శ్రీదేవి, తల్లులు, పిల్లలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.